కాలం ఒడిలో కరిగే క్షణాలు - జ్ఞాపకాలు
30 మార్చ్ 2025
ఆమెను ఇదివరకు పరోక్షంగా డిజిటలు చిత్రాలలో చూసినా ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటి సారి. చీరలో చూడముచ్చటగా అనిపించింది. ఓ బాపు గీసిన బొమ్మలా అమాయకంగా కనిపించింది. మొదటి చూపులోనే నా మనసును కట్టిపడేసింది. ముఖ్యంగా ఆ కళ్ళు, కాటుక పెడితే కందిపోతాయేమో. మనసంతా ఎవరో పూలు కుమ్మరించినట్లు సువాసనలు, ప్రేమ గాలులు హృదయం అంతరంగాలలో షికార్లు చేస్తున్నాయి. సూర్యాస్తామయం, సూర్యోదయం రెండు కలిసి జరిగినట్టు, ఏదో ఫీలింగ్. సంతింగ్ ఇజ్ బ్యూటిఫుల్ ఇంసైడ్. మాటల్లో వర్ణించలేను, చేతల్లో చూపించనూ లేను. అందుకే, వ్రాతల్లో బంధిస్తున్నాను. మదిలో కలిగిన ఈ స్వచ్ఛమైన భావం ప్రేమ కన్న గొప్పదే అయ్యుంటుంది. నింగి నుంచి నేలపైకి జారి పడ్డట్టు, నేను ఆమె ప్రేమలో పడ్డానంటే నమ్మసఖ్యంగా లేదు. మొదటి సారి ఆమెను చూసిన రోజు, నన్ను నేను కలిసిన రోజు.
కాళ్ళకు పట్టీలు
27 ఏప్రీల్ 2025, ఆమెతో కలిసి అడుగులు వేసిన మొదటి రోజు. గడిచిన రోజుల్లో ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. భాగ్యనగర విధుల్లో ఎన్నో సార్లు తిరిగినా ఆమెతో తిరగడం కొత్తగా అనిపించింది. బహుసా ఆమె నా పక్కన ఉండటమే కొత్తదనమేమో.
చెలి అధరములే జతి ప్రాంగణమై నవ్వులు విరిసెను పువ్వులలా.


0 Comments