చిత్రాలు - జ్ఞాపకాలు - మాటలు
కుసుమాల సుకుమారాలు
మందారా మందారా మది నీదే చెలితార !!
మందార పూవ్వు , అలా ఇంటి పెరటిలో నా కంట పడింది. చూసిన వెంటనే తుంచేయాలనిపించింది. ఆకుల మధ్యలో నుంచి దానిని వేరు చేయడానికి నాకు మనసు రాలేదు. కాని మోహపు దాహాల తేనెలు తుమ్మెదల పాలు కావాలి, నల్లటి నీలాల ఇరుకుల్లో తను చేరిపోవాలి. పుస్తకాల కాగితల నడుమ తను నలిగిపోవాలి. వీరుల సమాధులపై తను రాలిపోవాలి. చివరకు ఎవరికో ఒకరికి ఉపయోగపడి వాడిపోవాలి. ఊరికే కొమ్మకే ఉండిపోతే ఎలా?
| |
పోదల చాటున దాగిన ఈ పిచ్చి పూలలో కూడా అందాన్ని చూడగలను, చూపగలను. తొలకరి చినుకులతో తడిసిన లేలేత రేఖలకు పచ్చని ఆకుల తోడు, వెచ్చని కౌగిలిలా నెచ్చలి తోడులా నాకు గుండెల్లో దాచుకున్న ఆమె జ్ఞాపకాలు తోడు.
నా నుంచి దూరమైన జ్ఞాపకం
భాగ్యనగరం వెళ్ళి భాను గాడిని కలిసాను. ఇద్దరం కలిసి వాడి స్నేహితుడి బండి తీసుకుని డిఎల్ ఎఫ్ కు బయల్దేరాం.
భాను గాడు బండి నడుపుతున్నాడు అనుకున్నాను కాని వెనక్కి తిరిగి మేప్ చూస్తాడనుకోలేదు. కను రెప్పలు ఆడించే లోపే బండి కింద పడిపోయింది, భాను గాడు పక్కన నుల్చుని ఒంటికి అంటిన మట్టి దులుపుకుంటున్నాడు. నా మొకాలు నొప్పిగా ఉంది. ఆ క్షణం ఏమ్ జరిగిందో నాకర్ధం కాలేదు. కంగారులో సరిగా గమనించలేదు నా మొబైల్ ఎవడో దొంగిలించాడు. వెతికే లోపు స్విట్చాఫ్ చేసేసాడు. ఇలాంటి సమయంలో కూడా దొంగతనం ఎలా చేయాలనిపించిందో. వాడు దొంగిలించింది నా మొబైల్ ని మాత్రమే కాదు నేను ప్రాణం గా దాచుకున్న నా జ్ఞాపకాలను కూడా. భాను గాడి డిఎల్ ఎఫ్ మ్యాగి ఎంత పని చేసిందో.
I lost all my photos 😭😭😭
The good thing happened here is వాడి స్నేహితుడు నాకో మంచి స్నేహితుడయ్యాడు.
~ 30/05/2022
అలసిన మనసు చెప్పిన మాటలు
మర్చిపోయినట్టు నటించడం కన్నా మర్చిపోవడమే కష్టమేమో. ఎన్ని కన్నీళ్ళు కావాలో కన్న కలలన్నింటినీ ముంచెయ్యడానికి. కొన్ని మాటల్లో చెప్పలేము, కొండంత భాధైనా గుండెల్లో దాచేయాలి. గోరంత ప్రేమైనా దొరకదా అనే ఆశను ఆశగానే సమాధి చేయాలి. నడిచే దారుల్లో ఒంటరితనమే అసలైన తోడు. ఎంత వరకు ఈ ప్రయాణం, కాలం తనలో కలుపుకునే అంత వరకు.
ఎదురు చూపులు
ఎవరి కోసమో ఈ ఎదురు చూపులు,
దేని కోసమో ఈ ఎదురు చూపులు,
ఎన్నాళ్ళో ఈ ఎదురు చూపులు,
మనసు దరికి రాని మనసు కోసం.
మనసు దరికి రాని మనసు కోసం.
బదులు రాని మాట కోసం.
బ్రతుకు నేర్పు బాట కోసం.
ఆమె కోసం.
ప్రేమ కోసం.
వెన్నెల మైదానంలో నక్షత్రాల సాక్షిగా ఆమెను కలుసుకునే వేళ కోసం.
ఈ ఎదురు చూపులు....
నాలో దాగున్న కవి
నాలో దాగున్న కవీ నిదురపోతున్నావా?
అర్థరాత్రి ఉదయిస్తావా?
ఆమె కోసం కవితలు రాస్తావా?
లోకమంతా కోడై కూస్తావా?
ప్రేమ లేదని పేచీ పెడతావా?
ఆమె ఊసులు కలవరపెడుతుంటే కన్నీరు పెట్టుకుంటావా?
ఆమె ఊసులు కలవరపెడుతుంటే కన్నీరు పెట్టుకుంటావా?
అయ్యో పాపం ఇప్పుడెలా?
ఆకాశాన్నీ అయోమయంగా చూస్తావా?
మెరుస్తున్న తారల మాదిరి నీ కళ్ళు వెలిగిపోతున్నాయి, ఆమె చిత్రం చూసావా?
గుండెల్లో దాచుకున్నావా మరి?
బరువుగా లేవా జ్ఞాపకాలు?
ఒంటరిగా మోయగలవా?
వెళ్ళు కాలం జతలో కాగితంపై పయనించు ......
Trying To Find A Way Out
She is the most beautiful woman I ever saw in my life.
You know? what makes her even more beautiful.
Her Eyes.
They are like million oceans hiding salty tears, shining pearls & infinite feelings.
I lost my way in those eyes.
They are like million oceans hiding salty tears, shining pearls & infinite feelings.
I lost my way in those eyes.
Searching for the traces of love left for me, I got nothing.
She warned me at the origin not to dive deep into love. But I didn't listen.
She warned me at the origin not to dive deep into love. But I didn't listen.
I am alone in this mirage now.
Trying to find my way out.
Far away from realities, nearer to the fallacies, fantasies & Never Ending Stories
~ 06/05/2022
She Is Mine
She is like rain in the mid summer heat,
A wild relaxation to heart.
She is the fragrance of love.
Can travel through thin air,
And thick layers of the spine,
Till eternity.
She is a beautiful poem,
That ever written, in the pages of time.
"Señorita, Eres el amor de mi vida"
~ 27/04/2025



